YS Sharmila: కేసీఆర్ వెన్నుపోటు పొడవని వర్గం లేదు

YS Sharmila: కేసీఆర్ ఒక గజ దొంగలా తయారయ్యారని ఆరోపణ

Jyothi
Published on: 18 Oct 2022 7:14 AM IST
YS Sharmila Comments On CM KCR
X

YS Sharmila: కేసీఆర్ వెన్నుపోటు పొడవని వర్గం లేదు

YS Sharmila: తెలంగాణ ప్రజలలో సీఎం కేసీఆర్ వెన్నుపోటు పొడవని వర్గం లేదని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక గజ దొంగలా తయారయ్యాడని, అందరినీ పిచ్చోళ్లను చేశాడని ఆరోపించారు. కేసీఆర్ కి ఎన్నికలతోనే పని అన్న షర్మిల... ఓట్లు కోసమే కేసీఆర్ బయటకు వస్తాడని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి సబ్సిడీ పథకాలు అన్ని బంద్ పెట్టాడని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని బోధన్ మండలం ఊట్ పల్లి నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన షర్మిల... రాజీవ్ నగర్ తండా, బాన్సువాడ నియోజకవర్గం, మోస్ర మండలం పరిధిలోని మోస్ర, తాల్లకొత్తపేట, మాల్కాపూర్ తండా మీదుగా నిజామాబాద్ రూరల్ మండల పరిధిలోని గాంధీ నగర్, మల్లారం, ధర్మారం గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. మోస్రా మండల కేంద్రంలో రహదారిపై చెరుకు రసం అమ్మెవారిని కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు షర్మిల.

Jyothi

Jyothi

Next Story