సీఎం కేసీఆర్ మహాత్మా గాంధీతో పోల్చుకోవడం.. విడ్డూరంగా ఉందన్న YSRTP అధ్యక్షురాలు షర్మిల

YS Sharmila: బంగారు తెలంగాణను బీర్ల తెలంగాణగా మార్చారని మండిపాటు

Jyothi
Published on: 3 Oct 2022 6:17 PM IST
YS Sharmila Comments On CM KCR
X

సీఎం కేసీఆర్ మహాత్మా గాంధీతో పోల్చుకోవడం.. విడ్డూరంగా ఉందన్న YSRTP అధ్యక్షురాలు షర్మిల

YS Sharmila: సీఎం కేసీఆర్ మహాత్మా గాంధీతో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందని YSRTP అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ లా గాంధీ ఎప్పుడు దొంగ దీక్షలు చేయలేదని అన్నారు. కోట్ల మంది ప్రజలు కొట్లాడితే వచ్చిన తెలంగాణను తానే తెచ్చానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. కేసీఆర్ కుటుంబం ఎప్పుడైనా లాఠీ దెబ్బలు తిన్నారా అన్ని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని క్యాష్ చేసుకున్న కేసీఆర్‌కి గాంధీ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదని అభిప్రాయపడ్డారు. బంగారు తెలంగాణను బీర్ల తెలంగాణగా మార్చి పేదవాడికి బ్రతుకే లేకుండా చేశారని ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story