YS Sharmila: నేను వైఎస్సార్‌ బిడ్డను.. పులి బిడ్డను

YS Sharmila: కేసీఆర్‌కు తెలిసింది ఒకటే.. ప్రశ్నిస్తే అరెస్ట్ చేయించడం

Jyothi
Updated on: 18 Sept 2022 1:37 PM IST
YS Sharmila Comments On CM KCR
X

YS Sharmila: నేను వైఎస్సార్‌ బిడ్డను.. పులి బిడ్డను

YS Sharmila: వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ను కుట్ర చేసి చంపారని, తనను కూడా చంపాలని చూస్తున్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. అరెస్ట్ చేసి తన పాదయాత్ర ఆపాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తాను వైఎస్సార్‌ బిడ్డనని.. పులి బిడ్డనని, బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. తనకు బేడీలంటే భయం లేదని, దమ్ముంటే అరెస్ట్ చేయండంటూ సవాల్‌ విసిరారు. తన గొంతు నొక్కడం ఎవరితరం కాదన్న షర్మిల.. ప్రశ్నిస్తే అరెస్ట్ చేయించడం ఒకటే కేసీఆర్‌కు తెలుసంటూ మండిపడ్డారు. కేసీఆర్‌తో పోలీసులు ఉంటే.. తనతో జనం ఉన్నారని చెప్పారు షర్మిల.

Jyothi

Jyothi

Next Story