YS Sharmila: బీజేపీ, కాంగ్రెస్‌లకే కేసీఆర్ భయపడుతున్నారు..

YS Sharmila: YSRTP బరిలోకి దిగితే ఇక కాళ్లు పట్టుకుంటారేమోనని షర్మిల ఎద్దేవా...

Jyothi
Published on: 25 Aug 2022 10:35 AM IST
YS Sharmila Comments On CM KCR
X

YS Sharmila: బీజేపీ, కాంగ్రెస్‌లకే కేసీఆర్ భయపడుతున్నారు..

YS Sharmila: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండు తోడు తొంగలని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా గద్వాలలో జరిన సభలో ఆమె మాట్లాడారు. ఉపఎన్నిక వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తారని షర్మిల అన్నారు. ఇప్పుడు తనను ఆగం చేయకండంటూ కేసీఆర్ మునుగోడు ప్రజలకు వంగి వంగి దండం పెడుతున్నాడని షర్మిల అభిప్రాయపడ్డారు.

ఎందుకు పనికిరాని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను చూసి భయపడుతున్న కేసీఆర్.... వైఎస్ఆర్ టీపీ బరిలో దిగితే మునుగోడు ప్రజల కాళ్లు పట్టుకుంటారేమోనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారని.. కేసీఆర్ కుటుంబం జేబులు నింపుకుంటుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story