YS Sharmila: ఆమరణ దీక్షకు దిగిన వైఎస్‌ షర్మిల అరెస్ట్‌

YS Sharmila: హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 9 Dec 2022 3:49 PM IST
YS Sharmila Arrested Over Protest at Tank Bund
X

YS Sharmila: ఆమరణ దీక్షకు దిగిన వైఎస్‌ షర్మిల అరెస్ట్‌

YS Sharmila: హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన పాదయాత్రకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ షర్మిల ట్యాంక్‌బండ్‌ దగ్గర ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు దీక్షను భగ్నం చేశారు. దీంతో వైఎస్సార్‌టీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. లోటస్‌పాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story