YS Sharmila: TSPSC పేపర్ లీక్‌పై సిట్‌ దర్యాప్తు.. కొండను తవ్వి ఎలుకను పడుతున్నట్లుంది

YS Sharmila: SIT పాత్రధారులను మాత్రమే దోషులుగా చూపెడుతోంది

Dhatripriya
Published on: 23 April 2023 4:44 PM IST
YS Sharmila About SIT Investigation In TSPSC Paper Leak Case
X

YS Sharmila: TSPSC పేపర్ లీక్‌పై సిట్‌ దర్యాప్తు.. కొండను తవ్వి ఎలుకను పడుతున్నట్లుంది

YS Sharmila: టీ.ఎస్.పీ.ఎస్సీ పేపర్ లీకుల్లో సిట్ దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని వైఎస్సార్ టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల ఎద్దేవా చేశారు. 19మందిని అరెస్టు చేశామని చెబుతున్న సిట్... సూత్రధారులకు క్లీన్ చీట్ ఇచ్చే పనిలో ఉందన్నారు. ప్రగతి భవన్ డైరెక్షన్ లో సాగుతున్న దర్యాప్తులో తెర వెనుక ఉన్న అసలు దొంగలను దాచి పెడుతున్నారని ఆరోపించారు. బోర్డు సభ్యుల్లో ఒక్కరిని అదుపులోకి తీసుకోలేదన్నారు. పేపర్ లీకేజీలో ఉద్యోగులు ఉంటే సీబీఐ దర్యాప్తునకు కేసీఆర్ అండ్ బ్యాచ్ కు భయమెందుకని ట్విట్టర్ వేదికగా షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని... టీఎస్ పీఎస్సీ ప్రస్తుత బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story