కంచర్ల గ్రామంలో నిత్యావసర సరుకుల పంపిణీ

S. Srikanth
Published on: 26 April 2020 8:48 PM IST
కంచర్ల గ్రామంలో నిత్యావసర సరుకుల పంపిణీ
X

భిక్కనూరు: రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన యూత్ యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు గ్రామంలోని 30 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు కుంట మనీష్ రెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుత ఆపత్కాల సమయంలో తమ వంతు సహాయంగా యూత్ యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు వలస కూలీలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, తాము చేపట్టిన సేవా కార్యక్రమాలకు తెలంగాణ జాగృతి యువజన నాయకులు శ్రీరామ్ వెంకటేష్ సహకారం అందించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రకళ మాధవరెడ్డి, ప్రణీత్ రెడ్డి, బన్నీష్ రెడ్డి, అంకుష్ రెడ్డి, నిఖిల్ రెడ్డి, విశాల్, గ్రామస్తులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story