TS News: రంగారెడ్డిలో ప్రాణం తీసిన ఐపీఎల్‌ బెట్టింగ్‌

TS News: డబ్బులు చెల్లించలేక తీవ్ర ఒత్తిడిలో ప్రకాష్‌ ఆత్మహత్య

Dhatripriya
Published on: 18 May 2023 2:01 PM IST
Youth Committed Suicide Due Cricket Betting Rangareddy
X

TS News: రంగారెడ్డిలో ప్రాణం తీసిన ఐపీఎల్‌ బెట్టింగ్‌

TS News: రంగారెడ్డిలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ ఒత్తిడి ప్రాణం తీసింది. షాద్ నగర్ నాగూర్లగడ్డ తండాలో ప్రకాష్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్ లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో తన మిత్రులు బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలని బలవంతం చేశారు. బెట్టింగ్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు.

తాండకు చెందిన పలువురు ప్రజలు ప్రకాష్ ఆత్మహత్యను చూసి విలపిస్తున్నారు. చిన్నారి భవిష్యత్తు చిత్రమైందని భావించి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాండకు చెందిన ఆంగోతు అమరుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంది . ప్రకాష్ చిన్న కుమారుడు. ఇలా అర్ధాంతరంగా బెట్టింగ్ ఉచ్చులో పడి ఆత్మహత్య చేసుకోవడం తండాను కలచివేస్తుంది. యువకుడు ప్రకాష్ ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై వీర్లపల్లి శంకర్ స్పందించారు. స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో పోస్టుమార్టం గదిలో ఉన్న శవాన్ని సందర్శించారు. ప్రకాశ్ మృతి పట్ల విచారణ వ్యక్తం చేశారు. బెట్టింగ్ ముఠా నుండి యువకులను పోలీసులు రక్షించాలని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story