పెళ్లి కావడం లేదని రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ యువకుడు సూసైడ్‌ చేసుకున్న ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 12 Nov 2025 11:24 AM IST
పెళ్లి కావడం లేదని రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
X

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ యువకుడు సూసైడ్‌ చేసుకున్న ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లికావడంలేదన్న మనస్థాపంతో రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ కిందపడి సూసైడ్‌ చేసుకున్నాడు ఓ యువకుడు. మృతుడు బూర నరేష్‌గా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

నరేష్‌ స్వస్థలం వరంగల్‌ జిల్లా ఆత్మకూరుగా తెలుస్తోంది. హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ.. బట్టలషాపులో నరేష్‌ ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. అయితే.. గత నాలుగేళ్లుగా తనకు పెళ్లి సంబంధాలు కుదరడంలేదని నరేష్‌ తీవ్ర మనస్థాపానికి గురైనట్టు అతని సహచరులు చెబుతున్నారు. ఈ కారణంతోనే నరేష్‌ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story