ఆన్‌లైన్ గేమ్..అప్పులు..సెల్ఫీసూసైడ్

X
Highlights
ఆన్‌లైన్ గేమింగ్‌కు మరో యువకుడు బలైపోయిన ఘటన వనస్థలిపురం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. రైతుబజార్ సమీపంలో...
Arun Chilukuri27 Nov 2020 7:47 AM GMT
ఆన్‌లైన్ గేమింగ్‌కు మరో యువకుడు బలైపోయిన ఘటన వనస్థలిపురం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. రైతుబజార్ సమీపంలో నివాసం ఉంటున్న జగదీష్ ఇదివరకే ఆన్‌లైన్ గేమ్‌లు ఆడి తీవ్రంగా నష్టపోయాడు. సుమారు 16 లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. దీంతో తండ్రి నానా అవస్థలు పడి డబ్బులు సేకరించి ఆ అప్పును తీర్చాడు.
అయితే తన కారణంగా తండ్రి అప్పులు చేయడాన్ని జీర్ణించుకోలేని జగదీష్ మరోసారి ఆన్‌లైన్ గేమ్స్ ఆడి అప్పులను అధిగమించాలని నిర్ణయించుకున్నాడు. మరోసారి ఆన్‌లైన్ గేమింగ్‌లకు పాల్పడ్డాడు. అయితే మళ్లీ అప్పులపాలు కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Web Titleyouth commits suicide after losing rs 16 lakhs in online betting in Vanasthalipuram
Next Story