Corona Vaccine: కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్, ఆసక్తి చూపుతున్న యువత

Corona Vaccine: *18-44 వయస్సు వారికి అందిక టీకాలు : 1,80,32,845 *తొలి డోసు వేసుకున్నవారు 1,32,80,939 మంది

Shireesha
Updated on: 4 Nov 2021 9:45 AM IST
Youth Coming Forward to Take Corona Vaccine in Telangana | Covid Latest News
X

Corona Vaccine: కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్, ఆసక్తి చూపుతున్న యువత

Corona Vaccine: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకునేందుకు యువత పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో పంపిణీ చేసిన కొవిడ్‌ టీకాల్లో సగానికి పైగా డోసులను 18 నుంచి 44 మధ్య వయస్సు వారే పొందారు. తెలంగాణలో రెండో డోసు స్వీకరించడానికి ముందుకు రానివారు 35 లక్షల మందికి పైనే ఉంటారని అంచనా. వీరందరికీ యుద్ధప్రాతిపదికన టీకా వేసేందుకు వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. మరోవైపు దీపావళి సందర్భంగా టీకాల పంపిణీకి ప్రభుత్వ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకు రాష్ట్రంలో 3కోట్ల 28లక్షల టీకా డోసులు పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు తీసుకున్నవారు 2.28 కోట్లు మంది కాగా రెండు టీకాలు తీసుకున్నవారు కోటి దాటారు. ఇక 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి కోటి 80లక్షల వ్యాక్సిన్లు అందాయి. ఇందులో కోటి 32లక్షల తొలి డోసులు ఉన్నాయి. రెండు డోసులు వేసుకున్నవారు 47లక్షల 51వేల మంది ఉన్నారు. 45 ఏళ్ల పైబడినవారికి 1.36 కోట్ల టీకాలు వేశారు. మిగిలిన వ్యాక్సిన్‌లను వైద్యసిబ్బంది, ఇతర ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు వేశారు.

Shireesha

Shireesha

Next Story