Mancherial: మంచిర్యాల జిల్లాలో ప్రాణం తీసిన వాట్సప్‌ స్టేటస్‌

Mancherial: మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువతి

Rama Rao
Published on: 8 April 2022 12:44 PM IST
Young Woman Committed Suicide After Drinking Pesticide in Manchirala
X

మంచిర్యాల జిల్లాలో ప్రాణం తీసిన వాట్సప్‌ స్టేటస్‌

Mancherial: మంచిర్యాల జిల్లాలో వాట్సప్‌ స్టేటస్‌ ఓ యువతి ప్రాణం తీసింది. హైదరాబాద్‌లో పాలిటెక్నిక్‌ చదువుతున్న యువతి.. ఉగాది పండుగ సందర్భంగా తన సొంతూరైన తాండూర్‌ మండలం అచ్చలాపూర్‌కు వెళ్లింది. అయితే ఆ యువతితో కలిసి దిగిన ఓ ఫొటోను స్థానిక యువకుడి వాట్సప్‌ స్టేటస్ పెట్టాడు. అది చూసిన యువతి ఆ ఫొటోను తొలగించాలని వేడుకుంది. ఆ యువకుడు వినకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story