Telangana: ఎస్‌ఐ పరీక్ష సరిగా రాయలేదని చెరువులో దూకిన యువతి..

Kamareddy: ఎస్సై పరీక్ష బాగా రాయలేదన్న మనస్థాపంతో సూసైడ్‌

Jyothi
Updated on: 10 Aug 2022 1:18 PM IST
Young woman commits suicide in Kamareddy District Due To Depression Over SI Exam
X

కామారెడ్డి జిల్లా జంగంపల్లిలో యువతి ఆత్మహత్య

Kamareddy: కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో ఎస్సై రాత పరీక్ష బాగా రాయలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మద్నూర్ మండలం కోరేగావ్ గ్రామానికి చెందిన పంచశీల అనే యువతి ఎస్సై రాత పరీక్షలో ఫెయిలవుతానేమోనన్న అనుమానంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది హైదరాబాద్ నుంచి బస్సులో కామారెడ్డి వెళ్తూ మార్గమధ్యంలో దిగి జంగంపల్లి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు యువతి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. యువతి సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా జంగంపల్లి చెరువులో గాలింపు చేపట్టారు. స్థానికుల సాయంతో పోలీసులు యువతి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహన్ని కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

Jyothi

Jyothi

Next Story