Young Man Collapse at ECIL and Dead: ఈసీఐఎల్ జవహర్ నగర్ లో దారుణం..

Young Man Collapse at ECIL and Dead: హైదరాబాద్ నగరంలోని ఈసీఐఎల్ చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం జవహర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది.

Sumitra
Published on: 8 July 2020 4:00 PM IST
Young Man Collapse at ECIL and Dead: ఈసీఐఎల్ జవహర్ నగర్ లో దారుణం..
X
Representational Image

Young Man Collapse at ECIL and Dead: హైదరాబాద్ నగరంలోని ఈసీఐఎల్ చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం జవహర్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. చుట్టపక్కల వారు అందరూ చూస్తుండగానే ఓ యువకుడు రోడ్డుపై కుప్పకూలి విగతజీవిగా మారాడు. అది గమనించిన 108 అంబులెన్స్ సిబ్బంది ఆ యువకున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించేయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. అనంతరం అదే అంబులెన్స్ లో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే బి.జే.ఆర్ నగర్ కి చెందిన పృధ్విరాద్ అనే యువకుడు అనారోగ్యంతో ఇ.సి.ఐ.ఎల్ లోనీ జీనియా ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లాడు. కానీ అక్కడి వైద్య సిబ్బంది అతనికి వైద్యం అందించి కుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

అంతే కాక మరో ఆస్పత్రికి తీసుకెళ్లండని ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో ఆ యువకుని కుటుంబ సభ్యులు దిక్కు తోచని పరిస్థితిలో యువకుడిని తీసుకుని జీనియా ఆసుపత్రి బయట ఆటో కోసం వేచిచూస్తున్నారు. అంతలోనే ఆ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలి దయనీయ స్థితిలో చనిపోయాడు. పృథ్వీరాజ్‌ను ఆస్పత్రికి తరలించేందుకు సాయం కోసం ఎంత అర్థించినా ఎవరూ ముందుకురాలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కరోనా భయాలతో సాటిమనిషిని పట్టించుకోవడం మానేశారని వాపోయారు. యువకుడి వెంటే ఉన్న అతని తల్లి, చెల్లి, భార్య గుండెలవిసేలా రోదించారు.


Sumitra

Sumitra

Next Story