దారుణం.. జంట మృత‌దేహాల క‌ల‌క‌లం

Hyderabad: రాచకొండ కమిషనరేట్ పరిధిలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి.

Arun Chilukuri
Published on: 3 May 2022 6:25 PM IST
Young Man and womans Dead Body Found In Abdullapurmet
X

దారుణం.. జంట మృత‌దేహాల క‌ల‌క‌లం

Hyderabad: రాచకొండ కమిషనరేట్ పరిధిలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. కొత్తగూడెం బ్రిడ్జ్ వద్ద రెండు మృతదేహాలు గుర్తించిన పోలీసులు మృతులను హత్యచేసినట్లు గుర్తించారు. ఇక మృతుడు సికింద్రాబాద్ వారసి గూడకు చెందని యశ్వంత్ గా గుర్తించిన పోలీసులు చనిపోయిన మహిళ ఓ వివాహితగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మృతురాలి భర్తపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు ఈహత్యకు అక్రమ సంబంధమే కారణామా అన్న కోణంలో కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసులో దర్యాప్తు కోసం 3 బృందాలును ఏర్పాటు చేసిన పోలీసులు ఘటనాస్థలిలో ఈహత్యకు సంబంధించిన కొన్ని క్లూస్ దొరికినట్లు చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story