CM KCR: పూర్తి ఆరోగ్యంగా సీఎం కేసీఆర్‌

CM KCR: సాధారణ వైద్య పరీక్షలు, సిటీ స్కానింగ్‌ * ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ లేదు-వైద్యులు

Sandeep Eggoju
Published on: 22 April 2021 7:01 AM IST
Yashoda Hospital Doctors Released the CM KCR Health Bulletin
X
సీఎం కేసీఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: సీఎం కేసీఆర్‌ ఫిట్‌గా ఉన్నారు. ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉంది. కోవిడ్‌-19 లక్షణాలు తగ్గిపోయాయి. ఇక ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ కూడా సాధారణంగానే ఉందన్నారు వైద్యులు. సీఎం కేసీఆర్‌కు కరోనా లక్షణాలు తగ్గిపోయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్నారు వైద్యులు. ముఖ్యమంత్రికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి.., సిటీ స్కానింగ్‌ చేశామన్నారు. కేసీఆర్‌ ఊపిరితిత్తులకు ఎటువంటి ఇన్ఫెక్షన్‌ లేదని ఆక్సిజన్‌ స్థాయిలు సైతం బాగానే ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఆయన విధులకు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక రక్త పరీక్షల నమూనాలు సేకరించిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కి వెళ్లారు.

ఈనెల 19న యాంటీజెన్‌ పరీక్ష చేయించుకోగా సీఎంకు స్వల్పంగా కోవిడ్‌ లక్షణాలున్నట్లు తేలింది. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష సైతం నిర్వహించగా అందులోనూ పాజిటివ్‌గా తేలింది. అప్పటినుంచి వైద్యుల సలహా మేరకు ఆయన ఫామ్‌హౌస్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అటు సీఎం ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇక డాక్టర్ల సూచన మేరకు సీఎం ఫామ్‌హౌస్‌ నుంచి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు.

ఇక కరోనా పాజిటివ్‌ అనంతరం కేసీఆర్‌ మొదటిసారి ఆస్పత్రి వచ్చారు. అయితే సీఎం రాక సందర్భంగా ఆసుపత్రి వద్దకు పలువురు మంత్రులు, నేతలు వచ్చారు. దీంతో హాస్పిటల్‌ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌ దగ్గరుండి వైద్య పరీక్షలను చేయించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story