Bharat Jodo Yatra: ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావ యాత్ర

Bharat Jodo Yatra: మండల పరిషత్ కార్యాలయం నుంచి పాదాల వరకూ సాగిన యాత్ర

Shekhar G
Published on: 7 Sept 2023 2:41 PM IST
Yadagirigutta To Bharat Jodo Yatra
X

Bharat Jodo Yatra: ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావ యాత్ర

Bharat Jodo Yatra: ఆలేరు నియోజకవర్గంలోని యదగిరిగుట్టలో భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బీర్ల ఐలయ్య పాదయాత్ర నిర్వహించారు. ముందుగా అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ విగ్రహలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి పాదాల వరకు పాదయాత్ర చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర, సంవత్సరం పూర్తయిన సందర్భంగా పాదయాత్ర చేపట్టినట్లు బీర్ల ఐలయ్య తెలిపారు. భారత దేశ ప్రజలను ఏకం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ జోడో యాత్ర చేపట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలోనూ,రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story