యాదగిరిగుట్టలో దారుణం.. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం

యాదగిరిగుట్టలో దారుణం.. ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం
x
Highlights

యాదగిరిగుట్టలో ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

యాదగిరిగుట్టలో ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు, లాడ్జి యజమానిని అరెస్ట్ చేశారు. అల్వాల్‌కు చెందిన ముగ్గురు బాలికలతో యువకులు పరిచయం పెంచుకున్నారు. యాదగిరిగుట్టకు దైవ దర్శనం అని నమ్మించి, వారిని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ దర్శనం అనంతరం, బాలికలను ఒక లాడ్జిలోకి తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి ఒడిగట్టారు.

అనంతరం బాలికలను హైదరాబాద్‌లో వదిలి యువకులు పారిపోయారు. పిల్లలు రాత్రంతా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వారిని నిలదీయగా.. బాలికలు జరిగిన విషయాన్ని తమ తల్లిదండ్రులకు వివరించారు. దీంతో తల్లిదండ్రులు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేసి ముగ్గురు యువకులను మరియు లాడ్జి ఓనర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన యాదగిరిగుట్టలో తీవ్ర కలకలం రేపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories