Yadadri Temple: యాదాద్రి స్వామివారి సేవా టికెట్ల ధరలు పెంపు..

Yadadri Temple: స్వామివారి సన్నిధిలోని అన్ని పూజల టికెట్ ధరలు రెండింతలు పెంపు...

Shireesha
Published on: 10 Dec 2021 12:58 PM IST
Yadadri Lakshmi Narasimha Swamy Service Ticket, Prasadam and Pulihora Prices Increased | Telangana News Today
X

Yadadri Temple: యాదాద్రి స్వామివారి సేవా టికెట్ల ధరలు పెంపు..

Yadadri Temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి సేవా టికెట్ల ధరలను పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. స్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలు, నివేదన, ప్రసాదాల టికెట్ల ధరలను పెంచారు. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. పెంచిన ధరలు అనుబంధ ఆలయాలకూ వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

100 గ్రాముల లడ్డూ ధరను 20 రూపాయల నుంచి 30 రూపాయలకు పెంచారు. 500 గ్రాముల లడ్డూ ధర 150 నుంచి 200 రూపాయలకు పెరిగింది. అలాగే 250 గ్రాముల పులిహోర, వడ ప్రసాదం ధరను 15 నుంచి 20 రూపాయలకు పెంచారు. మరోవైపు.. స్వామివారి సన్నిధిలో జరిగే దాదాపు అన్ని పూజల ధరలను రెండింతలు చేశారు అధికారులు.

స్వామి వారి శాశ్వత నిత్యాభిషేకం, శాశ్వత కళ్యాణం, శాశ్వత నిత్య సహస్రనామర్చన, అండాళ్ అమ్మవారి‌ శాశ్వత నిత్యాభిషేకం ఒక్కో దానికి ప్రస్తుతం 2వేల 500 రూపాయలు ఉండగా.. దానిని 5వేల రూపాయలు చేశారు. కైంకర్య పూజలను కూడా రెట్టింపు చేసారు. ‌స్వామివారి నిజాభిషేకం ఇద్దరికి కలిపి 500 గా ఉన్న టికెట్‌ ధరను 800 రూపాయలకు పెంచారు.

Shireesha

Shireesha

Next Story