Zomato: జొమాటోలో ఆర్డర్ పెట్టిన బిర్యానీలో పురుగులు

Zomato: బిర్యానీలో పురుగులు.. డబల్ కమీటాలో బూజు * రెస్టారెంట్‌, జొమాటో కస్టమర్‌ కేర్‌కు కాల్

Sandeep Eggoju
Updated on: 21 March 2021 1:49 PM IST
Worms in Zomato Ordered Biryani
X

ఫైల్ ఫోటో 

Zomato: ఇంట్లో కూర్చొని, ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టాడు. తీరా.. అది వచ్చాక ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఆ తర్వాత ఆగ్రహానికి గురయ్యాడు. ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు.

అసలు ఏం జరిగిందంటే.. మేడ్చల్‌ జిల్లా సూరారంకాలనీకి చెందిన రాజేష్‌.. జొమాటోలో వెజ్‌ బిర్యానీ, డబల్‌ కమీటా ఆర్డర్‌ పెట్టాడు. డెలివరీ అవ్వగానే బిర్యానీ కుమ్మేద్దాం అనుకున్నాడు. తీరా.. ఓపెన్‌ చేస్తే, అందులో పురుగులు, బూజుపట్టి ఉన్న డబల్‌ కమీటా, బిర్యానీ నుంచి దుర్వాసన రావడంతో షాక్‌కు గురయ్యాడు.

‎వెంటనే ఆర్డర్‌ చేసిన HNA రెస్టారెంట్‌కు కాల్‌ చేశాడు. నో రెస్పాన్స్‌. జొమాటో కస్టమర్‌కేర్‌కు ఫోన్‌ చేశాడు. అక్కడ నుంచి కూడా నో రెస్పాన్స్. దీంతో ఆగ్రహానికి గురై.. సెల్ఫీ వీడియో తీసి తన ఆవేదన వ్యక్తపరిచాడు. తక్షణమే జొమాటో సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టాడు బాధితుడు రాజేష్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story