Rajanna Sircilla: తహసీల్దార్‌ కార్యాలయానికి తాళిబొట్టు కట్టిన మహిళ

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన వెలుగుచూసింది.

Arun Chilukuri
Published on: 30 Jun 2021 4:28 PM IST
Women Protest at MRO Office in Rudrangi Rajanna Sircilla District
X

Rajanna Sircilla: తహసీల్దార్‌ కార్యాలయానికి తాళిబొట్టు కట్టిన మహిళ

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన వెలుగుచూసింది. తన భూమిని తనకు పట్టా చేయాలని కోరుతూ ఓ మహిళ తన తాళిబొట్టును తహసీల్దార్‌ కార్యాలయం గుమ్మానికి వెలాడదీసింది. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన రాజేశం మూడేళ్ల క్రితం మృతి చెందాడు. అయితే తమ భూమిని వేరేవాళ్లకి పట్టా చేశారని తన పేరుపై పట్టా చేయాలంటూ మృతుడి భార్య గత కొంతకాలంగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. అయితే బాధితురాలి ఆవేదనను సిబ్బంది పట్టించుకోక పోవడంతో లంచంగా తన మంగళ సూత్రాన్ని తీసుకోవాలని ఆఫీస్‌ గేట్‌కు కట్టింది. ఇది చూసిన స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story