Bandi Sanjay: రెండున్నర గంటల పాటు బండి సంజయ్‌ను విచారించిన మహిళా కమిషన్‌

Bandi Sanjay: అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు.. ఎలాంటి దురుద్దేశం లేదు

Dhatripriya
Published on: 18 March 2023 4:55 PM IST
Women Commission Interrogated Bandi Sanjay For Two And Half Hours
X

Bandi Sanjay: రెండున్నర గంటల పాటు బండి సంజయ్‌ను విచారించిన మహిళా కమిషన్‌

Bandi Sanjay: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు రెండున్నర గంటల పాటు బండి సంజయ్‌ను మహిళా కమిషన్‌ విచారించింది. రాజకీయంగానే కాకుండా మరే విధంగానైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించింది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని తెలిపింది. మహిళల పట్ల పలు సందర్భాల్లో బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను వీడియో రూపంలో చూపించి విచారణ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదంటూ బండి సంజయ్‌కు మహిళా కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు వ్రాత పూర్వకంగా వివరణ ఇచ్చారు బండి సంజయ్‌. అనుకోకుండా చేసిన వ్యాఖ్యలే తప్ప ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story