Nirmal: పోలీసులపై తిరగబడ్డ మహిళలు.. కానిస్టేబుల్‌కు గాయాలు

Nirmal: నిరసగా ధర్నాకు దిగిన మహిళలు

Sandeep Eggoju
Published on: 25 Oct 2021 3:05 PM IST
Womans Protest Against Ambedkar Idol Destroy in Nirmal District
X

నిర్మల్ లో అంబెడ్కర్ విగ్రహాం ద్వంసానికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళన (ఫైల్ ఇమేజ్)

Nirmal: నిర్మల్ జిల్లా బైంసాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బైంసా బస్టాండ్‌లో నిన్న గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా నిర్మల్ చౌరస్తా వద్ద దళిత మహిళలు ధర్నాకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై మహిళలు తిరగబడ్డారు. దీంతో పలువురు మహిళా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story