రఘునందన్‌పై ఫిర్యాదు: మహిళ ఆత్మహత్యాయత్నం

Arun Chilukuri
Updated on: 17 Nov 2020 4:24 PM IST
రఘునందన్‌పై ఫిర్యాదు: మహిళ ఆత్మహత్యాయత్నం
X

తనపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అత్యాచారానికి పాల్పడ్డారని రాధా రమణి అనే మహిళ ఆరోపిస్తోంది. ఈ విషయమై గత ఏడాది రామచంద్రపురం పీఎస్‌లో కేసు పెట్టినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదన్న మనస్తాపంతో నిన్న సాయంత్రం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను పఠాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాధా రమణి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. గతంలో రఘునందన్‌ న్యాయవాదిగా ఉన్న సమయంలో తనపై అత్యాచారానికి ఒడిగట్టారని అతడితో పాటు పలువురు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేవరకు దీక్ష కొనసాగిస్తానని తేల్చిచెప్పింది రాధా రమణి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story