భర్త మీద కోపంతో పసికందును భవనం పైనుంచి కిందకు పడేసిన మహిళ

X
Highlights
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఫతేనగర్ డివిజన్ నేతాజీనగర్‌లో భర్త మీద కోపంతో భార్య తన 14 రోజుల పసికందును భవనం పైనుంచి కిందకు పడేసింది.
admin14 Nov 2020 12:22 PM GMT
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఫతేనగర్ డివిజన్ నేతాజీనగర్‌లో భర్త మీద కోపంతో భార్య తన 14 రోజుల పసికందును భవనం పైనుంచి కిందకు పడేసింది. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే మృతి చెందింది. వేణుగోపాల్, లావణ్యకు 2016లో వివాహమైంది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. రెండో సంతానంలో పాప పుట్టింది. అయితే గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విభేదాలు తలెత్తడంతో భర్త మీద కోపంతో భార్య లావణ్య 14 రోజుల పసికందును మూడో అంతస్తు నుంచి పడవేయడంతో పసికందు మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Web TitleWoman throws newborn from 3rd floor of building
Next Story