హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో విషాదం

Arun Chilukuri
Published on: 3 Nov 2020 11:39 AM IST
హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో విషాదం
X

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. సరూర్‌ నగర్‌లో వాకింగ్ కు వెళ్లిన 80 ఏళ్ల వృద్ధురాలు ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందింది. నాలాలో మహిళ కొట్టుకుపోయిందన్న సమాచారం అందుకున్న వెంటనే డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్‌, పోలీసులు, GHMC సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చైతన్యపురిలోని హనుమాన్ నగర్ నాలాలో మృతదేహం లభ్యమవడంతో మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవల హైదరాబాద్‌ నగరంలో భారీగా వర్షాలు కురవడంతో నాలాలు ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. ఇక తాజా ఘటన నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు వరుసగా సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story