Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. బట్టలు ఉతకాలని తీసుకెళ్లి మహిళపై గ్యాంగ్ రేప్

Hyderabad: హైదరాబాద్ మధురానగర్ పీఎస్ పరిధిలో ఓ మహిళ గ్యాంగ్ రేప్‌కి గురైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 5 Nov 2024 10:53 PM IST
Woman Sexually Assaulted by Three People in Hyderabad
X

హైదరాబాద్‌లో దారుణం.. బట్టలు ఉతకాలని తీసుకెళ్లి మహిళపై గ్యాంగ్ రేప్

Hyderabad: హైదరాబాద్ మధురానగర్ పీఎస్ పరిధిలో ఓ మహిళ గ్యాంగ్ రేప్‌కి గురైంది. మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. హైటెక్ సిటీ క్రాస్ రోడ్ వద్ద ఓ భవనంలో పనిముగించుకుని వచ్చిన మహిళను... బట్టలు ఉతికే పని ఉందని మాయమాటలు చెప్పి ముగ్గురు యువకులు తీసుకెళ్లారు.

గదిలో మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి కేకలు విని పక్కింటి మహిళ రావడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు పట్టుకోగా... మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story