Mahabubabad: హోటల్ నిర్వహిస్తూనే.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గృహిణి

Mahabubabad: జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి అర్హత సాధించిన గృహిణి

Shekhar G
Published on: 2 March 2024 2:15 PM IST
Woman Secured Two Government Jobs In Kesamudram Mahabubabad District
X

Mahabubabad: హోటల్ నిర్వహిస్తూనే.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గృహిణి

Mahabubabad: పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సాధించడమే గొప్ప విషయం అలాంటిది.. మహబూబాబాద్ జిల్లాలో ఓ గృహిణి హోటల్ నిర్వహిస్తూ..ఖాళీ సమయంలో చదువుకుని రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. కేసముద్రం మండల కల్వల గ్రామానికి చెందిన గృహిణి జ్యోతి... భర్త నవీన్ తో కలిసి హోటల్ నిర్వహిస్తోంది. హోటల్ నిర్వహణలో భర్తకు సహాయంగా నిలుస్తూనే ఆమె ఎంఏ, బీఈడీ పూర్తి చేసింది. తన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆకాంక్షతో కాళీ సమయంలో చదువు కొని..

గత సంవత్సరం ఆగస్టులో నిర్వహించిన పీజీటీ, టీజీటీ ఉద్యోగాలతోపాటు.. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు పరీక్ష రాసారు. వారం కిందట వెలువడిన పీజీటీ ఫలితాల్లో జ్యోతి ఎంపికయ్యారు. అంతేకాకుండా ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్ పోస్టుకు అర్హత సాధించారు. జ్యోతి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story