పెద్ద విషాదానికి దారి తీసిన ఓ ఇల్లాలి పొరపాటు.. మంచి నూనె అనుకొని పురుగుల మందు పోసి..

Woman Mistakenly Prepare Food With Pesticide In Khammam
x

పెద్ద విషాదానికి దారి తీసిన ఓ ఇల్లాలి పొరపాటు.. మంచి నూనె అనుకొని పురుగుల మందు పోసి..

Highlights

Khammam: ఓ ఇల్లాలి చిన్న పొరపాటు పెద్ద విషాదానికి కారణమైంది.

Khammam: ఓ ఇల్లాలి చిన్న పొరపాటు పెద్ద విషాదానికి కారణమైంది. పురుగుల మందుతో వండిన కూర తిని మహిళ మృతి చెందగా ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మేడిదపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బండ్ల నాగమ్మ వంట గదిలో ఉన్న పురుగుల మందుని మంచి నూనె అనుకొని కూరలో పోసి వండింది. ముందుగా తిన్న ఆమె భర్త కోసం భోజనం తీసుకుని పొలానికి వెళ్లింది.

రెండు ముద్దలు తిన్న భర్త అనుమానం వచ్చి అన్నం వదిలేసాడు. అయితే అప్పటికే తినేసిన నాగమ్మకు వాంతులు అయి సృహ తప్పి పడిపోయింది. హుటాహటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ నాగమ్మ మృతి చెందగా ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉంది. నాగమ్మకు మతి స్థిమితం సరిగా ఉండదని అందుకే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories