ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో యువతి అదృశ్యం

Sandeep Eggoju
Published on: 4 Feb 2021 12:57 PM IST
Woman Missing in Adilabad Rims Hospital
X

Representational Image

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో యువతి అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులకు తోడుగా ఉండేందుకు వచ్చిన యువతి కనిపించకుండా పోయింది. ఇచ్చోడ మండలం ముక్రా (బి) గ్రామానికి చెందిన దుర్పథ మిస్సింగ్‌పై బంధువులు పోలీసులను ఆశ్రయించారు. అయితే గత నెల 27న ఆస్పత్రిలో యువతి పట్ల కొంతమంది యువకులు అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అదేరోజు బాధితురాలు డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు కూడా చేసింది. ఆ తర్వాత జనవరి 30 నుంచి యువతి కనిపించకుండా పోయింది. దీంతో ఈ నెల 2న పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story