భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దారుణం..కట్టుకున్న భార్యను హత్య చేసిన కసాయి భర్త

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దారుణం..కట్టుకున్న భార్యను హత్య చేసిన కసాయి భర్త
x
Highlights

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అగ్నిసాక్షిగా తాళికట్టిన భార్యను హతమార్చాడు ఓ కసాయి భర్త.

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అగ్నిసాక్షిగా తాళికట్టిన భార్యను హతమార్చాడు ఓ కసాయి భర్త. జూలూరుపాడు మండలం పాపకొల్లు ముధ్యాలమ్మకాలనీకి చెందిన ధరావత్ గోపి, టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన సునీతను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం సాగు చేస్తూ జీవనం చేస్తున్నారు. కొంతకాలంగా తన భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో తరచూగొడవపడుతూ వస్తున్నాడు.

ప్రతీ రోజు మారిదిరాగనే ఇద్దరు కలిసి పొలానికి వెళ్లి వచ్చారు. తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్య సునీతను నరికి చంపాడు గోపి. పొలానికి వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి రాకపోవడంతో ఆ దంపతుల కుమార్తెలు బంధువులతో కలిసి చుట్టుపక్కల ఆరా తీశారు. వర్షం వచ్చిన నేపథ్యంలో పిడుగుపడి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని ఆందోళన చెందారు. ఆ తార్వాత పొలంలో పడి ఉన్న సునీత మృత దేహాన్ని చూసి బోరున విలపించారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. భార్యను హతమార్చిన భర్త గోపీ పరారయ్యాడు. పోలీసులు గోపీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories