Adibatla: యువతి కిడ్నాప్‌ కలకలం.. సినిమా స్టైల్లో 100 మందితో వచ్చి..

Adibatla: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోలో యువతి కిడ్నాప్ ఘటన ఘటన కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 9 Dec 2022 5:21 PM IST
Woman Kidnaped in Adibatla
X

Adibatla: యువతి కిడ్నాప్‌ కలకలం.. సినిమా స్టైల్లో 100 మందితో వచ్చి..

Adibatla: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోలో యువతి కిడ్నాప్ ఘటన ఘటన కలకలం రేపుతోంది. 100 మందికి పైగా యువకులతో వచ్చిన నవీన్‌రెడ్డి యువతిని అపహరించుకుని తీసుకెళ్లాడు. ఇంట్లోని సామగ్రి, సీసీ కెమెరాలు, కార్లను ధ్వంసం చేశారని తెలిపారు. గతంలో నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు యువతి కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయినప్పటికీ నవీన్‌రెడ్డి దాడికి తెగబడ్డాడని ఆరోపించారు. ఇంటిపై దాడికి పాల్పడుతున్న సమయంలో 100 నంబర్‌కు కాల్‌ చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రహదారిపై బాధితులు ధర్నాకు దిగారు. ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. గతంలో నవీన్‌రెడ్డి, యువతికి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story