Hyderabad: అధికారులకు చుక్కలు చూపించిన కరోనా పేషెంట్

Hyderabad: అసలే ఒమిక్రాన్ భయంతో వణుకుతున్న ప్రజలకి కరోనా పేషెంట్స్ ప్రవర్తన మరింత ఆందోళన పెంచుతోంది.

Arun Chilukuri
Updated on: 3 Dec 2021 3:59 PM IST
Woman Escaped From Samshabad Airport who Tested Corona Positive
X

Hyderabad: అధికారులకు చుక్కలు చూపించిన కరోనా పేషెంట్

Hyderabad: అసలే ఒమిక్రాన్ భయంతో వణుకుతున్న ప్రజలకి కరోనా పేషెంట్స్ ప్రవర్తన మరింత ఆందోళన పెంచుతోంది. నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ్రిటన్ నుంచి వచ్చిన 36 ఏళ్ల కరోనా పేషెంట్ టిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో తప్పించుకుని ఇంటికెళ్లిపోయింది. కుత్బుల్లాపూర్లోని గణేష్ నగర్ సమీపంలోని రిడ్జ్ టవర్స్ కు చేరుకుంది. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు ఆమె పాస్ పోర్ట్ ఆధారంగా వివరాలను జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు తెలిపారు.

వెంటనే పోలీసులు, వైద్యాధికారులు రిడ్జ్ టవర్స్ లోని ఆమె ఇంటికి చేరుకోగా అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. మొత్తం మీద అధికారులు, అసోసియేషన్ సిబ్బంది అందరూ కలసి వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. యువతి తల్లి దండ్రులను కూడా ఐసోలేషన్ కు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story