Hyderabad: మీర్‌పేట్‌లో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం.. మనస్తాపంతో మృతి

Hyderabad: మనస్థాపానికి గురై శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్న యువతి

Shekhar G
Updated on: 31 Jan 2024 1:30 PM IST
Woman Ends Life By Consuming Sanitizer In Salon
X

Hyderabad: మీర్‌పేట్‌లో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం.. మనస్తాపంతో మృతి

Hyderabad: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పీఎస్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీలోని ఓ ప్రైవేట్‌ సెలూన్‌లో సానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య చేసుకుంది. సెలూన్ యజమాని.. మురళి వేధిస్తున్నాడని.. మనస్థాపానికి గురై దేవరకొండకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా సెలూన్‌లో పనిచేస్తున్న యువతిని మురళి లైంగికంగా వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మురళి సెలూన్‌లో ఉన్న ఓ గదిలోకి యువతిని లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు.

యువతి కేకలు వేయడంతో మురళి అక్కడి నుంచి పరారయ్యాడు. యువతి తీవ్ర మనస్థాపానికి గురై సెలూన్‌లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట్ పోలీసులు...దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story