108 Ambulance: ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ కే రోగం.. ఓ నిండు ప్రాణం బలి !

108 Ambulance: ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ కే రోగం వచ్చింది. ఆస్పత్రికి వెళ్తున్న సమయంలో మొరాయించడంతో ఏకంగా ఓ నిండు ప్రాణం బలైంది.

Arun Chilukuri
Published on: 1 July 2022 3:34 PM IST
Woman Died due to Ambulance Repair Bhadradri Kothagudem
X

108 Ambulance: ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ కే రోగం.. ఓ నిండు ప్రాణం బలి !

108 Ambulance: ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ కే రోగం వచ్చింది. ఆస్పత్రికి వెళ్తున్న సమయంలో మొరాయించడంతో ఏకంగా ఓ నిండు ప్రాణం బలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం, రాళ్లపురం గ్రామానికి చెందిన మడివి చుక్కమ్మ కుటుంబ కలహాలతో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే అంబులెన్స్ కు సమాచారం అందించి చుక్కమ్మను ఆస్పత్రికి తరలించారు.

అది కాస్తా మధ్యలోనే మొరాయించింది. ముందుకు కదల్లేకపోయింది. దీంతో స్థానికులే తలో చేయి వేసి 108 ను నెట్టాల్సి వచ్చింది. దీంతో చుక్కమ్మను బైక్ పై ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినా మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. చివరి నిముషంలో చికిత్స అందితే ఆమె ప్రాణం దక్కేది. ఇలా పని చేయని అంబులెన్సుల వల్ల చివరి నిమిషంలో ప్రాణాలు దక్కకుండా పోతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story