తీర్పులో జాప్యం.. హైకోర్టు దగ్గర మహిళ ఆత్మహత్యాయత్నం

X
Highlights
తెలంగాణ హైకోర్టు దగ్గర కలకలం రేగింది. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కవిత అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి ...
Arun Chilukuri6 Oct 2020 9:30 AM GMT
తెలంగాణ హైకోర్టు దగ్గర కలకలం రేగింది. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కవిత అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. చాలా రోజులుగా పెండింగులో ఉన్న కేసులో తీర్పు రాకపోవడంతో నిరాశ తో ఆత్మహత్య చేసుకోవాలని కవిత చూసింది. గోదావరి ఖనికి చెందిన కవిత అనే మహిళకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టులో ఉంది. ఈ కేసు చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉండటం రోజులు గడుస్తున్నా తీర్పు రాకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. దీంతో హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకే ప్రయత్నం చేసింది. దీంతో అప్పుడు అక్కడే ఉన్న హైకోర్టు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయి వెంటనే కవితను అడ్డుకున్నారు. సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చుబెట్టి కవితను సెక్యూరిటీ విచారిస్తున్నారు. కవిత స్వస్థలం గోదావరి ఖని. ఏప్రిల్ 11న మురళి అనే వ్యక్తి హత్యాచారం చేసాడని బాధితురాలి ఫిర్యాదు చేసింది.
Web TitleWoman Commits Suicide in High Court
Next Story