logo
తెలంగాణ

నెల క్రితమే పెళ్లి.. బ్లేడ్‌తో భర్త గొంతుకోసిన భార్య

Woman Attacks Husband With Blade
X

దారుణం.. బ్లేడుతో భర్త గొంతు కోసిన భార్య

Highlights

Hanumakonda: పెళ్లయిన నెల రోజులకే భర్త గొంతు కోసింది ఓ భార్య.

Hanumakonda: పెళ్లయిన నెల రోజులకే భర్త గొంతు కోసింది ఓ భార్య. హన్మకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన మామిడిశెట్టి రాజు కు, అర్చనతో నెల రోజుల క్రితం వివాహం అయింది. రాజు మల్కపేటలోని ఓ క్రషర్‌లో సూపర్‌ వైజర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాజు ఇంట్లో పడుకుని ఉండగా అర్చన బ్లేడ్‌తో దాడి చేసింది. ఈ ఘటనలో రాజు మెడకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఎంజీఎంకు తరలించారు. రాజుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే పెళ్లిన నెల రోజులకే భర్తపై హత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Web TitleWoman Attacks Husband With Blade
Next Story