యాసిడ్ తాగించి హత్యాయత్నం... వివస్త్రను చేసి నిర్బంధం

Hyderabad: హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది.

Arun Chilukuri
Published on: 23 Jan 2022 4:39 PM IST
Woman Allegations on Husband who try to Killing her
X

యాసిడ్ తాగించి హత్యాయత్నం... వివస్త్రను చేసి నిర్బంధం

Hyderabad: హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆస్తుల కోసం కట్టుకున్న భార్యను అంతమొందించాలనుకున్నాడో భర్త. భార్యకు యాసిడ్ తాగించి వివస్త్రను చేసి నిర్బంధించారు. ధర్మనాయక్, పద్మ భార్య భర్తలు. ధర్మనాయక్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ ఈగా పని చేస్తున్నాడు. 2008లో ఇరేగేషన్ సర్కిల్ అధికారిగా ఉన్న సమయంలో ఇంటిపై ఏసీబీ పోలీసులు దాడి చేసి పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

అప్పటి నుండి తనపై ఆస్తుల కోసం వేధింపులు మొదలయ్యాయని పద్మ వెల్లడించారు. జనవరి 4న భర్త, అతని తల్లి, సహచరులు బలవంతంగా తనతో యాసిడ్ తాగించారని ఆరోపించింది. దీంతో తనకు 4 సర్జరీలు జరిగాయని పేర్కొంది. సకాలంలో వైద్యం అందడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇంటి నుండి బయటికి వస్తే వారి బండారం బయట పడుతుందని ఇంట్లో ఓ గదిలో వివస్త్రను చేసి బంధించారని తెలిపింది. భర్త నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులు తనకు న్యాయం చేయాలని పద్మ వేడుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story