Phone Tapping Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్లు విత్‌డ్రా

Phone Tapping Update: ఈ కేసులో ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 70 కింద కేసు నమోదు

Shashank Gullapelli
Published on: 15 April 2024 4:56 PM IST
Withdrawal Of Bail Petition Of Accused In Phone Tapping Case
X

Phone Tapping Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్లు విత్‌డ్రా

Phone Tapping Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి ఎసీఎంఎం కోర్టులో నిందితులు బెయిల్‌ పిటిషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఈ కేసులో ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 70 కింద నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్ ప్రకారం.. పదేళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశాలున్నాయి.. ఈ నేపథ్యంలోనే.. సెషన్స్‌ కోర్టుకు వెళ్లాలని నిందితుల తరపు లాయర్లకు నాంపల్లి కోర్టు సూచించింది. దీంతో ఏసీఎంఎం కోర్టులో వేసిన పిటిషన్లను నిందితులు విత్‌డ్రా చేసుకున్నారు. రేపు నాంపల్లి సెషన్స్‌ కోర్టులో.. ఫ్రెష్‌గా బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story