Jagga Reddy: అవసరమైతే రాజీనామా చేస్తా..

Jagga Reddy: టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సీనియర్ల దాడి కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 6 Jan 2022 5:23 PM IST
Will Resign if Necessary Says Jagga Reddy
X

Jagga Reddy: అవసరమైతే రాజీనామా చేస్తా..

Jagga Reddy: టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సీనియర్ల దాడి కొనసాగుతోంది. నిన్న పీఏసీ మీటింగ్‌లో దమ్ముంటే సంగారెడ్డిలో గెలవాలని సవాల్ విసిరిన జగ్గారెడ్డి మరో సారి హాట్ కామెంట్స్ చేశారు. అవసరమైతే రాజీనామా చేస్తానని అన్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ సత్తా ఏంటో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. హుజూరాబాద్ కంటే తక్కువ ఓట్లే వస్తాయని జగ్గారెడ్డి అన్నారు. మరోవైపు జగ్గారెడ్డిని బుజ్జగించే పనిలో సీనియర్లు భట్టి, శ్రీథర్ బాబు, గీతారెడ్డి ఉన్నారు. ఉదయమే జగ్గారెడ్డితో వీహెచ్ భేటీ అయ్యారు. రాజీనామా చేస్తే పార్టీలో సీనియర్ల పట్టు పోతుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story