టీజేఎస్ అధినేత కోదండరాం ఎటువైపు?

Prof Kodandaram: టీజేఎస్ అధినేత కోదండరాం ఎటువైపు చూస్తున్నారు?

Arun Chilukuri
Updated on: 11 May 2022 8:00 PM IST
Will Prof Kodandarams TJS Merge with AAP
X

టీజేఎస్ అధినేత కోదండరాం ఎటువైపు? 

Prof Kodandaram: టీజేఎస్ అధినేత కోదండరాం ఎటువైపు చూస్తున్నారు? కాంగ్రెస్, బీజేపీ తాజాగా ఆప్ వైపు వెళ్తున్నట్టుగా కన్పించినా కోదండరామ్ వెనుకడుగేస్తున్నారా? పార్టీలో చేరేందుకు ఇటు విలీనానికి ప్రొఫెసర్ నో చెప్తున్నారా? అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‎లో బలంగా విన్పిస్తోంది. టీజేఎస్‌ను విలీనం చేయాలంటూ కోదండరామ్‌పై నేతల ఒత్తిడి చేస్తున్నా ప్రొఫెసర్ మాత్రం ముందుకు రావడం లేదు.

కానీ భవిష్యత్‌పై గంపెడాశతో ఉన్న కోదండరామ్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బాటలో పయనిస్తారా అన్న చర్చ మొదలయ్యింది. టీఆర్ఎస్ ఢీకొట్టే పార్టీతోనే కోదండరామ్ జట్టు కడ్తారని భావన ఉంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారని అనుచరులు అంటున్నారు. సొంతంగా పోటీ ఆలోచన లేకున్నా అందుకే వెయిటింగ్ చేస్తున్నారట. ఐతే కోదండకు ఆప్ చేయిచ్చిందా? లేదంటే ఆయన పునరాలోచనలో పడ్డారా? అన్న గుసగుసలు ప్రచారంలో ఉన్నాయ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story