Y. S. Sharmila: కేసీఆర్ కుటుంబానికి మాత్రం పదవులు ఉంటాయా..?

Y. S. Sharmila తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమని చెప్పి..ఇప్పుడు నిరుద్యోగుల ప్రాణాలు తీస్తున్నారు

Dhatripriya
Updated on: 10 Jun 2023 9:31 AM IST
Will Only KCR  Family Have Positions?
X

Y. S. Sharmila: కేసీఆర్ కుటుంబానికి మాత్రం పదవులు ఉంటాయా..?

Y. S. Sharmila: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ YSRTP తెలంగాణ అధ్యక్షురాలు షర్మిల ట్వీట్ చేశారు. తెలంగాణొస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన పెద్ద దొర.. ఇప్పుడు నిరుద్యోగుల ప్రాణం తీశారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి పదవులు పోతే మాత్రం.. ఆగమేఘాల మీద మళ్లీ పదవులు తెచ్చుకుంటారని విమర్శించారు. బిశ్వాల్ కమిటీ లెక్కల ప్రకారం లక్షా 91 వేల కొలువులు ఉన్నా.. కేసీఆర్ మాత్రం పట్టించుకోలేదన్నారు. కనీసం స్వయం ఉపాధి కూడా కల్పించలేని దౌర్భాగ్యమైన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.

Dhatripriya

Dhatripriya

Next Story