Vennela: కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

టికెట్ కేటాయించిన నేతలకు కృతజ్ఞతలు -గద్దర్ కూతురు వెన్నెల

Arun Chilukuri
Updated on: 28 Oct 2023 6:30 PM IST
Will Hoist Congress Flag in Secunderabad Cantonment Says Vennela
X

Vennela: కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

Vennela: కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెలకు టికెట్ కేటాయించిన సందర్భంగా కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు వెన్నెల నివాసానికి చేరుకుని కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ టికెట్ కేటాయించిన కేంద్ర నాయకులకు, రాష్ట్ర నాయకులకు వెన్నల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కలిసి వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగుతానని ఆమె తెలిపారు. అధిష్టానం ఆదేశాల తీసుకొని ప్రచారం చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story