Bandi Sanjay: కేటీఆర్‌ పరువు ₹100 కోట్లయితే.. యువత భవిష్యత్తుకు మూల్యమెంత?

Bandi Sanjay: TSPSC పేపర్‌ లీక్‌ కేసు.. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.

Arun Chilukuri
Published on: 29 March 2023 5:44 PM IST
Will Fight Legally Says Bandi Sanjay on KTR Notice
X

Bandi Sanjay: కేటీఆర్‌ పరువు ₹100 కోట్లయితే.. యువత భవిష్యత్తుకు మూల్యమెంత?

Bandi Sanjay: TSPSC పేపర్‌ లీక్‌ కేసు.. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులపై ఘాటుగా స్పందించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. కేటీఆర్‌ పరువుకే ‎వంద కోట్లయితే.. 30 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్థకమైంది.. వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తావని ప్రశ్నించారు సంజయ్. లీకేజీలో తన కుట్ర ఉందన్న కేటీఆర్‌పై ఎంత దావా వేయాలని నిలదీశారు. కేటీఆర్‌ ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నోటీసులను లీగల్‌గానే ఎదుర్కొంటామన్న బండి సంజయ్‌.. సీఎం కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా పోరాడతామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందేనని, నిరుద్యోగులకు లక్ష రూపాయలు ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పారు బండి సంజయ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story