Komatireddy Venkat Reddy: బాధ్యతలు అప్పగిస్తే మునుగోడులో ప్రచారం చేస్తా..

Will Campaign of Given Opportunity, Says Komatireddy Venkat Reddy
x

Komatireddy Venkat Reddy: బాధ్యతలు అప్పగిస్తే మునుగోడులో ప్రచారం చేస్తా..

Highlights

Komatireddy Venkat Reddy: తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్ అని బాధ్యతలు అప్పగిస్తే మునుగోడులో ప్రచారం చేస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

Komatireddy Venkat Reddy: తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్ అని బాధ్యతలు అప్పగిస్తే మునుగోడులో ప్రచారం చేస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే బాధ్యతల అప్పగింత నిర్ణయం పార్టీ చూసుకుంటుందని తెలిపారు. అభివృద్ధి అంతా సిద్దిపేట, గజ్వెల్, సిరిసిల్లకే చేరిందని మునుగోడును ఇంతవరకు పట్టించుకోలేదని వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్లా, గజ్వేల్ నియోజకవర్గాలే ఉన్నట్లుగా అక్కడ మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఫామ్ హౌస్ చుట్టు 600 కోట్లతో 3 నెలల్లో రోడ్లు వేస్తే ఈ మునుగోడులో చిన్న రోడ్డును వేయడానికి ఏడాది కాలం పట్టిందని దుయ్యబట్టారు. పిలాయిపల్లి కాలువను రూ.350 కోట్లతో ప్రారంభిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని అయితే అందులో రూ.50 కోట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోచుకున్నారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories