సెకండ్ సెటప్ పెట్టాడు.. భర్తను కరెంట్ పోల్‌కు కట్టేసి చెప్పుల దండ వేసిన..

Wife Slapped Husband for Second Marriage Manthani
x

సెకండ్ సెటప్ పెట్టాడు.. భర్తను కరెంట్ పోల్‌కు కట్టేసి చెప్పుల దండ వేసిన..

Highlights

Extramarital Affair: పెళ్లి చేసుకొని కొడుకు పుట్టాక రెండో వివాహం చేసుకొని మోసం చేసిన భర్తకు భార్య దేహశుద్ధి చేసింది.

Extramarital Affair: పెళ్లి చేసుకొని కొడుకు పుట్టాక రెండో వివాహం చేసుకొని మోసం చేసిన భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. కరెంట్ పోల్‌కు కట్టేసి చెప్పుల దండ వేసింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం స్వర్ణపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్వర్ణపల్లి గ్రామానికి చెందిన కుంబం రామస్వామి, పద్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు కాగా రెండో కూతురు అఖిలను హన్మకొండకు చెందిన శ్రీకాంత్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం అయిన ఐదు నెలలకు అఖిల గర్భవతి కావడంతో పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి శ్రీకాంత్ అఖిలను తీసుకెళ్లలేదు. కొడుకు పుట్టాక కూడా కనీసం చూడడానికి రాలేదని అఖిల ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయాలని కోరింది. సంఘటన స్థలానికి చేరుకున్న మంథని పోలీసులు విచారణ చేపట్టారు.Show Full Article
Print Article
Next Story
More Stories