Gadwal: భర్తపై వేడి నూనె పోసిన భార్య .. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Gadwal: కుటుంబ కలహాలతో భర్తపై వేడి నూనె పోసిందో భార్య.. ఐదు రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందిన భర్త నేడు మృతి చెందాడు.

Arun Chilukuri
Published on: 16 Sept 2025 2:39 PM IST
Gadwal: భర్తపై వేడి నూనె పోసిన భార్య .. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
X

Gadwal: కుటుంబ కలహాలతో భర్తపై వేడి నూనె పోసిందో భార్య.. ఐదు రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందిన భర్త నేడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్లెందొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పద్మ వెంకటేష్‌లకు 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అయితే.. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 10వ తేదీ రాత్రి మరోసారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలోనే ఉదయం 5 గంటల సమయంలో నిద్రిస్తున్న భర్తపై వేడినూనె పోసింది భార్య. తీవ్ర గాయాలు కావడంతో.. కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్సపొందుతున్న వెంకటేష్.. మృతి చెందాడు. భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం పద్మను రిమాండ్‌కు తరలించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story