పెళ్లై 36 రోజులే.. భర్తను చంపేందుకు రెండు సార్లు ప్లాన్.. రెండోసారి పక్కా స్కెచ్..

Wife Killed Husband with the help of Boyfriend in Siddipet
x

పెళ్లై 36 రోజులే.. భర్తను చంపేందుకు రెండు సార్లు ప్లాన్..రెండోసారి పక్కా స్కెచ్..

Highlights

Wife Killed Husband: సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఇష్టంలేని పెళ్లి చేశారని కొత్తపెళ్లికూతురు ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది.

Wife Killed Husband: సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఇష్టంలేని పెళ్లి చేశారని కొత్తపెళ్లికూతురు ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన చంద్రశేఖర్‌కు, తొగుట మండలం గుడికందులకు చెందిన శ్యామలకు మార్చిలో వివాహ‍ం జరిగింది. శ్యామలకు తన గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయినా శ్యామల తల్లిదండ్రులు చంద్రశేఖర్‌తో వివాహం జరిపించారు.

కుటుంబసభ్యుల ఒత్తిడితో చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకున్న శ్యామల ప్రియుడు శివతో కలిసి హత్యకు ప్రణాళిక వేసింది. అయితే తన ప్రేమికుడు శివను మర్చిపోలేక కట్టుకున్న భర్తను దూరం చేసుకోవాలనే ప్రయత్నాన్ని పెళ్లైన 36 రోజులకే అమలు చేసింది. భర్త అడ్డు తొలగించుకునేందుకు గతంలో ఓసారి ప్లానేసి ఫెయిల్‌ అయింది. ఆ తర్వాత ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి శ్యామల మరోసారి హత్యకు కుట్ర చేసింది. ప్రియుడితో కలిసి గొంతు నులిపి హత్య చేసింది శ్యామల.

Show Full Article
Print Article
Next Story
More Stories