భార్య అందంగా లేదని భర్త వేధింపులు.. విషాదాంతమైన ప్రేమ పెళ్లి..

Vikarabad: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 19 Feb 2022 4:22 PM IST
Representational Image
X

Representational Image

Vikarabad: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం జీన్గుర్తి గ్రామానికి చెందిన మహేష్ యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన సునీతను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత భార్య అందంగా లేదని తరచు వేధింపులకు గురి చేశాడు. భర్త వేధింపులు భరించలేక సునీత ఆత్మహత్యకు పాల్పడింది. మహేష్ సునీతను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవాడని సునీత బంధువులు ఆరోపించారు. తన చెల్లెలు మృతికి మహేష్ కారణమంటూ సునీత సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో కరణ్కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story