Warangal: వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు భార్య దేహశుద్ధి

Illegal Affair In Warangal: వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

Arun Chilukuri
Published on: 4 Sept 2022 2:45 PM IST
Wife Attacked Husband Over Illegal Affair In Warangal
X

Warangal: వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు భార్య దేహశుద్ధి

Illegal Affair In Warangal: వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అతను ఉండే ఇంటిపై బంధువులతో కలిసి దాడి చేసింది. వరంగల్ జిల్లా పైడిపల్లిలో ఈ ఘటన జరిగింది. భార్య చేతిలో తన్నులు తిన్న ఈ భర్త పేరు జీవన్ కుమార్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌గా ఉద్యోగం చేసేవాడు. రూ.కోటి అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో రెండు సంవత్సరాల క్రితమే సస్పెండ్ అయ్యాడు. అయితే జీవన్ మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య ఆవేదన ‍వ్యక్తం చేస్తోంది. దీంతో తన భర్తకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారకపోడవంతో ఆగ్రహంతో బంధువులతో కలిసివెళ్లి చితకబాదింది. అనంతరం ఆ ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story